చిన్ని పచ్చిమిర్చి ముక్కను పొరపాటున కొరికేస్తేనే ఘాటు తలకెక్కుతుంది. అలాంటిది 1250 బాటిళ్ల సాస్‌లో ఓ ఘనుడు మునిగాడంట. ఇంకేంముంది.. ఒళ్ళంతా మండిపోయింది. అంతే.. ఒకటే గగ్గోలు పెట్టాడు. పెద్దగా కేకలు పెట్టాడు. అయితే ఇదంతా పాపులారిటీ కోసం. 1250 బాటిళ్ల మిరపకాయల సాస్‌లో తాను స్నానం చేశానని గొప్పగా చెప్పుకోవడానికి.. ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు.
మిర్చి బాధను తట్టుకుని అనుకున్న పాపులారిటీ సాధించాడు. ఈ వీడియోకు 25 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. అమెరికాకు చెందిన క్యాండర్ అనే వ్యక్తి ఈ ప్రయోగం చేశాడు. మిర్చి సాస్‌తో నిండిన టబ్‌లో.. ఒంటిపై బట్టలు లేకుండా.. ఒక లోయర్ మాత్రం ధరించి అందులో మునిగాడు. అయితే మిర్చి ఘాటుకు ఒళ్లంతా మండిపోయింది. అంతే వెంటనే షవర్ కిందికి వెళ్ళిపోయాడు. ఉపశమనం కోసం ప్రయత్నించాడు.