ఇదేంటి హోం వర్క్‌గా సూసైడ్ నోటా? ది లాస్ట్ జర్నీ పేరిట సూసైడ్‌కు ముందు కలిగే ఆలోచనలు రాసి తీసుకురావాలా? అంటూ ఆశ్చర్యపోకండి. సాధారణంగా విహారయాత్ర అనుభవాలు, ప్రముఖుల వ్యక్తుల జీవిత చరిత్రలపై అభిప్రాయాలు రాయాల్సిందిగా హోం వర్క్ ఇవ్వడం పరిపాటి. కానీ ఇంగ్లండ్‌లోని ఓ పాఠశాల సూసైడ్ నోట్‌ను హోం వర్క్‌గా ఇచ్చి కలకలం రేపింది.
నిండా 15 ఏళ్లు కూడా లేని పిల్లలకు ఇలాంటి హోం వర్క్ లు ఇస్తే, వారిలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తుతాయంటూ ప్రశ్నిస్తూనే .. పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై హోం వర్క్ ఇచ్చిన టీచర్ మాట్లాడుతూ, సిలబస్‌లో ఉన్న అంశంపైనే హోమ్ వర్క్ ఇచ్చానని స్పష్టం చేశారు.