సియర్రాలియోన్‌లో పెను విషాదం... భారీ పేలుడు ఘటనలో 91 మంది మృతి

శనివారం, 6 నవంబరు 2021 (20:14 IST)
ఆఫ్రికా దేశం సియర్రాలియోన్‌లో భారీ పేలుడు జరిగింది. రాజధాని ఫ్రీ టౌన్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌- ట్రక్కు ఢీకోవడంతో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.
 
ఆఫ్రికా దేశం సియర్రాలియోన్‌లో భారీ పేలుడు జరిగింది. రాజధాని ఫ్రీ టౌన్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌- ట్రక్కు ఢీకోవడంతో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. 
 
బిజీగా ఉన్న మార్కెట్‌ ప్రాంతంలో పేలుడు జరిగింది. మార్కెట్లో షాపింగ్‌కు వచ్చిన వాళ్లు కూడా పేలుడు ధాటికి చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంధన డిపో సమీపం లోనే పేలుడు జరగడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. 
 
ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి చెలరేగిన మంటలు జనావాసాలకు కూడా వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి చమురు లీక్‌ కావడంతో తీసుకెళ్లడానికి చాలామంది జనం పోగయ్యారు. ఇదే వాళ్ల పాలిట శాపంగా మారింది. ఆకస్మాత్తుగా పేలుడు జరగడంతో జనం ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు