నేపాల్ భూకంపాన్ని పసిగట్టిన పక్షులు... పిచ్చెక్కినట్టు గోల చేస్తూ....

సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:34 IST)
నేపాల్ భూకంపాన్ని పక్షులు ముందుగానే పసిగట్టాయి. అప్పటి వరకు సరదాగా గడుపుతున్న పక్షులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. పిచ్చెక్కినట్టు అరుస్తూ.. గోల చేస్తూ.. గాల్లో చక్కర్లు కొట్టాయట. ఇంతలోనే దట్టంగా ధూళికమ్మడం, కాళ్ల కింద భూమి కదలడం స్థానికులు గుర్తించారట. దీంతో కొంత మంది పరుగులు తీశారట. పక్షుల అలజడిని పర్యాటక వీడియో గ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. 
 
సాధారణంగా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాన్నైనా పక్షులు, జంతువులు ముందుగానే పసిగడతాయని నిపుణులు చెపుతున్నాటారు. పెద్దలు కూడా అదే విషయాలను పదేపదే చెపుతుంటారు. వీరి మాటలను నిజం చేసేలా నేపాల‌ భూకంపాన్ని ముందుగానే పక్షులు పసిగట్టి ఒక్కసారిగా వేలాది పక్షులు అలజడికి గురయ్యాయట. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని చారిత్రాత్మక ప్రదేశం దర్బార్ స్క్వేర్ దగ్గర ఈ పరిస్థితి కనిపించిందట.

వెబ్దునియా పై చదవండి