కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన బ్రెజిల్ ప్రెసిడెంట్.. అపరాధం

ఆదివారం, 13 జూన్ 2021 (16:53 IST)
కరోనా వైరస్ బారినపడి అపారనష్టం కలిగిన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. అయితే, ఈ రాష్ట్రం ఇపుడిపుడే మెల్లగా కోలుకుంటోంద. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు, మాస్క్ పెట్టుకోనందుకు, భౌతిక దూరం నిబంధనలను పెడచెవిన పెట్టినందుకుగానూ బ్రెజిల్ అధ్యక్షుడుకి 100 డాలర్ల జరిమానా వేశారు. 
 
ఆదివారం సావో పాలోలో భారీ బైక్ ర్యాలీ తీశారు. ‘యాక్సిలరేట్ ఫర్ క్రైస్ట్’లో భాగంగా నిర్వహించిన ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు. ఆ ర్యాలీలో స్వయంగా బైక్ నడిపిన బోల్సోనారో ఓపెన్ ఫేస్ హెల్మెట్ పెట్టుకున్నారు. 
 
మాస్కును మాత్రం మరిచారు. అది సావో పాలో నిబంధనలకు విరుద్ధమన్న గవర్నర్ జొవావో డోరియా ఫైన్ వేశారు. వచ్చే ఏడాది ఎన్నికలుండడంతో ఇప్పటి నుంచే సన్నాహకాలు ప్రారంభించిన బోల్సోనారో బైక్ ర్యాలీ తీశారు.
 
అయితే, రాజకీయ ప్రత్యర్థి అయిన డోరియా.. ర్యాలీ తీయొద్దని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వినిపించుకోకుండా ఆయన ర్యాలీకి వెళ్లారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు