బెజిల్లో దారుణం జరిగింది. 16 యేళ్ళ బాలికపై 30 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బ్రెజిల్‌లోని రియో డీ జనైరో ప్రాంతంలో జరుగగా, శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో, వార్త సోషల్ మీడియాలో వైరల్‌లా వ్యాపించింది.
ఇందులో రేప్ వీడియో, ఆ యువతి నగ్న చిత్రాలు ఉన్నాయి. వీటిని నెట్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 30 మంది కామాంధుల కోసం ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. ట్విటర్ ఖాతాల ఆధారంగా కామాంధుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.