దీంతో వారిద్దరి వివాహం చేసుకునేందుకు నిర్ణయించారు. మేన్సిన్ జైలు ఖైదీ కావడంతో క్యాలిఫోనియాలో ఉన్న పునరావాస శాఖలో అనుమతి పొందాల్సి ఉంది. అతను తనకంటే 54 ఏళ్ల వయస్సు తక్కువగా ఉన్న పార్టన్ను పెళ్లి చేసుకునేందుకు అనుమతి కోరుతూ గత 7వ తేది దరఖాస్తు చేసుకున్నాడు. దానికి అంగీకారం లభించింది. దీంతో త్వరలో వీరిద్దరు వివాహం చేసుకోనున్నారు.
మేన్సిన్ గత 40 ఏళ్ళకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ వివాహం గురించి 26 ఏళ్ల యువతి పార్టన్ మాట్లాడుతూ తాము ప్రేమించుకుంటున్నట్టు తెలిపింది. తాను మేన్సిన్తో జీవితాతం ఉంటానని పేర్కొంది. ప్రేమకు వయస్సు అడ్డంకి కాదనడానికి మాత్రమే కాదు, ప్రేమ గుడ్డిది అనడానికి కూడా ఈ జంట నిదర్శనంగా నిలుస్తారు.