జో బైడెన్, జీ జిన్‌పింగ్ మధ్య సోమవారం వర్చువల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తైవాన్ సహా పలు అంశాలు చర్చకు వచ్చిన సందర్భంగా జిన్‌పింగ్ హెచ్చరించినట్టు చైనా మీడియా పేర్కొంది. తైవాన్ తమ భూభాగమే అని చైనా వాదిస్తోంది.
బైడెన్‌తో భేటీలో ప్రధానంగా ఇదే సమస్యను లేవనెత్తినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. తైవాన్ అధికారులు స్వాతంత్ర్యం కోసం యుఎస్‌పై ఆధారపడటానికి పదేపదే ప్రయత్నించారు అని జిన్‌పింగ్ వ్యాఖ్యలను చైనా అధికారిక మీడియా ఏజెన్సీ జిన్హువా ఉటంకిస్తూ.. యుఎస్‌లోని కొంతమంది వ్యక్తులు చైనాను నియంత్రించడానికి తైవాన్‌ను ఉపయోగించాలని భావిస్తున్నారు.. ఈ ధోరణి చాలా ప్రమాదకరమైనది.. నిప్పుతో చెలగాటమాడుకోవడం లాంటిది.. నిప్పుతో ఆడుకుంటే కాలిపోతారు అని హెచ్చరించారు.