ఐదేళ్ల బాలికపై చర్చి ఫాదర్ లైంగికదాడి.. మాటల్లో చెప్పలేక బొమ్మల ద్వారా వివరించిన బాలిక

శుక్రవారం, 21 అక్టోబరు 2016 (15:26 IST)
బ్రెజిల్ చర్చిలో జరిగిన ఘటన సభ్యసమజాన్ని తలదించుకునేలా చేస్తోంది. మానవత్వానికే మాయని మచ్చలా మారింది. ఐదేళ్ళ బాలికపై ఓ చర్చి ఫాదర్ అత్యాచారం చేసి లైంగికంగా హింసించాడు. చర్చి ఫాదర్ లైంగిక దాడి చేయడాన్ని తాను ఎదుర్కొంటున్న సమస్యను బాలిక బొమ్మలతో తల్లిదండ్రులకు వివరించింది. ఇది విన్న తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ఓ చర్చి ఫాదర్ దగ్గరకు జావో దాసిల్వ అనే ఐదు సంవత్సరాల బాలిక క్లాసులకు వెళ్లేది. ఒకరోజు ఏమైందో ఏమోకానీ ఇకపై క్లాసులకు వెళ్లనని మారాం చేసింది. ఎందుకు వెళ్లవని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. విషయాన్ని ఎలా చెప్పాలో తెలియని చిన్నారి తన భావాన్ని, బాధను బొమ్మల్లో గీచి వివరించింది. బాలిక గీచిన చిత్రాలను చూసిన తల్లిదండ్రులను అవాక్కయ్యారు. 
 
తనను చర్చి ఫాదర్ ఏవిధంగా లైంగికంగా వేధించేవాడో డ్రాయింగ్ ద్వారా పూసగుచ్చినట్టు వివరించింది.  దీంతో నివ్వెరపోయిన బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి