ఇండియాలో లాక్​డౌన్​ పెడితేనే కరోనా కంట్రోల్​ అవుతుంది, ఎవరు?

మంగళవారం, 4 మే 2021 (19:26 IST)
వాషింగ్టన్:ఇండియాలో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్​ను కట్టడి చేయాలంటే వెంటనే కొన్ని వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ పెట్టాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వైజర్, ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు.

ఇప్పటికే దేశంలో హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయ్యాయని, హెల్త్ కేర్ సిస్టం చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. ‘‘ఇండియా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన శుక్రవారం ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.

ఏ దేశంలోనైనా 6 నెలలు లాక్ డౌన్ పెట్టాల్సిన పనిలేదని, కొన్ని వారాలు టెంపరరీగా లాక్ డౌన్ పెట్టినా వైరస్ ట్రాన్స్ మిషన్ సైకిల్ తెగిపోతుందన్నారు. ఇది వైరస్ పై పోరాటంలో కీలకం అవుతుందన్నారు. లాక్ డౌన్​ను ఎవరూ కోరుకోరని, కానీ ఎక్కువ రోజులైయితేనే అది ప్రాబ్లమ్ అవుతుందన్నారు.
 
‘‘దేశంలో చాలా మంది తమ తల్లులు, తండ్రులు, అక్కా చెల్లెండ్లను రోడ్ల మీదకు తెస్తున్నారు. ఆక్సిజన్ ఇచ్చి కాపాడాలని వేడుకుంటున్నారని నాకు తెలిసింది. ఇదంతా చూస్తుంటే దేశంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి ప్రత్యేక వ్యవస్థ లేనట్లు అనిపిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటాన్ని నడిపేందుకు ఎక్స్‌పర్టులతో ఒక గ్రూపును ఏర్పాటు చేయాలి’’ అని ఫౌచీ వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు