కరోనా మహమ్మారి కోసం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించిన భారత్ బయోటెక్, యూఎస్ భాగస్వామ్య కంపెనీ ఆస్ట్రాజెనికాతో ప్రతిపాదనలను అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది.
మరోవైపు, ఇకపై అత్యవసర అనుమతి కోరబోమని, కోవిడ్ టీకా ఆమోదం కోసం దాఖలు చేస్తామని కంపెనీ గురువారం తెలిపింది. అదనపు క్లినికల్ ట్రయల్ ప్రారంభించమని ఎఫ్‌డీఏ సిఫారసు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, అత్యవసర వినియోగానికి అవసరమైన బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ (బీఎల్ఎ) కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది.