గర్భవతి అయిన భార్యను మొసలి మింగేసిందని తెలియడంతో ఆ భర్త జీర్ణించుకోలేక పోయాడు. అంతేకాదు.. ఆ మొసలిని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ఘటన యుగాండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యుగాండాలో నాలుగు నెలల క్రితం ముబారక్ బటాంబుజే భార్య దిమెత్రియో నబిరే (గర్భిణీ) తన గూడెం మహిళలతో కలిసి నీళ్లు తీసుకురావడానికి క్యోగా సరస్సు దగ్గరికి వెళ్లింది.
తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లి దాన్ని కనుగొన్నాడు. దానిని కర్రలు, రాళ్లతో చంపేందుకు ప్రయత్నించాడు. కానీ ఏమీ చేయలేకపోయారు. దీంతో స్ధానికంగా ఉండే ఓ కమ్మరి దగ్గరికి వెళ్లి తానేం చేయాలనుకుంటున్నాడో అతడికి వివరంగా చెప్పాడు.