క్షమాభిక్ష ప్రసాదిస్తే అప్రూవర్‌గా మారడానికి సిద్ధం: డేవిడ్‌ హెడ్లీ

శుక్రవారం, 11 డిశెంబరు 2015 (09:22 IST)
ముంబై దాడుల కేసులోని నిందితుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ అప్రూవర్‌గా మారేందుకు సానుకూలంగా ఉన్నాడు. అయితే, ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ మెలిక పెట్టాడు. ప్రస్తుతం అమెరికా జైలులో కారాగారవాసం గడుపుతున్న హెడ్లీ వద్ద భారత విచారణాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపారు. 
 
ఆ సమయంలో తనను క్షమిస్తే ముంబైలో 26/11 దాడుల కేసులో తాను అప్రూవర్‌గా మారడానికి సిద్ధంగా ఉన్నానని ఈ పాకిస్థానీ - అమెరికన్‌ పౌరుడు డేవిడ్‌ హెడ్లీ వెల్లడించాడు. లష్కరే తోయిబా ఉగ్రవాది అయిన హెడ్లీ ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనకు క్షమాభిక్ష పెడితే అప్రూవర్‌గా మారడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి