ఉడతకు మరణశిక్ష విధించిన బ్రిటన్ - ఎందుకో తెలుసా?

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (07:33 IST)
అనేక మందిని కొరికి గాయపరిచినందుకు ఓ ఉడతకు బ్రిటన్ దేశంలో మరణశిక్షను విధించారు. దీన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు స్థానిక చట్టాలు అనుమతించలేదు. దీంతో విషపు సూది వేసి ఉడతకు మరణశిక్ష విధించారు. ఈ ఘటన బ్రిటన్ దేశంలోని ఫ్లింట్‌షైర్‌లోని బక్లీ పట్టణంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొరిన్ రెనాల్డ్స్ అనే మహిళ ఓ జంతు, పక్షి ప్రేమికురాలు. ఈమె ఓ ఉడతను పెంచుతూ వచ్చింది. ఈ క్రమంలో క్రిస్మస్‌కు ముందు ఉడతకు ఆహారం పెడుతున్న సమయంలో ఆ ఉడత ఆమె చేతిని కొరికి జారుకుంది. 
 
ఆ తర్వాత రోజు నుంచి చుట్టుపక్కల వారు కూడా ఈ ఉడత కాటుకు గురయ్యారు. అలా ఏకంగా 18 మందిని గాయపరిచింది. క్రిస్మర్ రోజున పట్టణంలో మొత్తం ఈ ఊడత తీరు చర్చనీయాంశమైంది. 
 
ఆ తర్వాత రెనాల్డ్స్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ ఉడతను అలానే వదిలివేస్తే చాలా ప్రమాదమని తెలిసి దాన్ని బోనులో బంధించి, ద రాయల్ సొసైటీ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అనే  సంస్థకు అప్పగించింది. 
 
అయితే, ఈ ఉడతను తొలుత అటవీ ప్రాంతంలో వదిలివేద్దామని భావించారు. కానీ, అందుకు స్థానిక చట్టాలు అంగీకరించకపోవడంతో విషపు ఇంక్షన్ వేసి మరణక్షను విధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు