విమాన ప్రమాదాలు: మలేసియన్ ఎయిర్‌లైన్స్ నేమ్ ఛేంజ్!

మంగళవారం, 29 జులై 2014 (14:29 IST)
మలేషియన్ ఎయిర్ లైన్స్ పేరు మార్చుకోవాలనుకుంటోంది. రెండు విపత్కర విమాన ప్రమాదాలు సంభవించిన నేుథ్యంలో మలేషియన్ ఎయిర్ లైన్స్ పేరు మార్చుకునే దిశగా చర్యలు చేపట్టింది. రానున్న కాలంలో సంస్థ పేరు ప్రతిష్ఠలు నిలుపుకునే భాగంలో ఇప్పటివరకైన నష్టాన్ని పూడ్చుకుని, పునర్నిర్మించుకోవాలని చూస్తున్నట్లు యూకే టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. 
 
ఎయిర్ లైన్స్‌లో మెజారిటీ శాతం ప్రభుత్వానిదే. అయితే, కొత్త పెట్టుబడిదారుల కోసం సంస్థ ఎదురుచూస్తోంది. అంతేకాక సంస్థ లాభదాయతకోసం అవుట్ సోర్సింగ్‌ను విస్తరించాలనుకుంటోంది. ఆరు నెలల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో 537 మంది మరణించారని యూకే టెలిగ్రాఫ్ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి