పాకిస్థాన్‌పై మానవరహిత విమానాలతో దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఉగ్రవాదాన్ని లేకుండా చేసేందుకు అమెరికా అహర్నిశలు కృషి చేస్తోంది. కానీ, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదులకు ఊతమిస్తూ, వారి స్థావరాలను కొనసాగించేందుకు సహకరిస్తోంది. దీంతో పాకిస్థాన్‌పై మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది.
ఇందులోభాగంగా, పాక్ ఉగ్ర స్థావరాలపై మానవ రహిత విమానాలతో దాడులు చేసేందుకు ట్రంప్ నుంచి ఆదేశాలు వచ్చాయని రక్షణ శాఖ అధికారి ఒకరు 'రాయిటర్స్' వార్తా సంస్థకు తెలిపారు. పాకిస్థాన్‌కు అందిస్తున్న సహాయ సహకారాలను తగ్గించాలని, ఇప్పటికే చేసిన మొత్తాన్ని అప్పుగా మార్చాలని, 'నాన్ - నాటో' సభ్యదేశాల్లోని ప్రధాన దేశాల్లో ఒకటైన పాకిస్థాన్ రేటింగ్‌ను తగ్గించాలని కూడా ట్రంప్ సూచించినట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు.