సద్దామ్ హుస్సేన్ దుర్మార్గుడే.. టెర్రరిజాన్ని మట్టుబెట్టడంలో సక్సెస్ అయ్యాడు: డొనాల్డ్

గురువారం, 7 జులై 2016 (15:00 IST)
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇరాక్‌లో స‌ద్దామ్ హుస్సేన్‌, లిబియాలో గ‌డాఫీ ఇంకా ప‌రిపాలిస్తున్న‌ట్ల‌యితే ప‌రిస్థితులు ఇప్పుడున్న దానికంటే ఎంతో మెరుగ్గా ఉండేవ‌ని ట్రంప్ సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇరాక్ మాజీ నియంత స‌ద్దామ్ హుస్సేన్‌ను పొగుడుతూ ట్రంప్ చేసిన ప్రసంగం ప్రస్తుతం దుమారం రేపుతోంది. 
 
స‌ద్దామ్ హుస్సేన్ దుర్మార్గుడే అయినా.. టెర్ర‌రిజాన్ని మ‌ట్టుబెట్ట‌డంలో అతడు సక్సెస్ అయ్యాడని ట్రంప్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. స‌ద్దామ్ మంచివాడ‌ని అన‌ను కానీ.. అతడి పరిపాలన ప్రస్తుతం కంటే మెరుగ్గా ఉండేదని తెలిపారు. నియంత‌ల‌ను పొగిడే స్వ‌భావ‌మున్న ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడైతే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాల‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు.

వెబ్దునియా పై చదవండి