అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. గత నెలలో జరిగిన అగ్రరాజ్య ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కానీ, ఈ ఓటమిని ఆయన స్వీకరించడం లేదు. అంటే ప్రత్యర్థి గెలుపును అంగీకరించడం లేదు. వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు.
ఈ క్రమంలో అధ్యక్ష భవనంలో క్రిస్మస్ పార్టీ జరిగింది. ఇందులో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, గడిచిన నాలుగేళ్లు అద్భుతంగా సాగాయని, మరో నాలుగేళ్లు పాలించేందుకు ప్రయత్నిస్తున్నామని, వీలైతే మళ్లీ నాలుగేళ్ల తర్వాత కలుస్తా అన్న సందేశాన్ని ట్రంప్ వినిపించారు.
అ.యితే, బైడెన్ చేతిలో ఓటమిపాలు కావడంతో ట్రంప్ రాజకీయాల్లో కొనసాగుతారా? లేక తిరిగి వ్యాపార జీవితంలోకి ప్రవేశిస్తారా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోనే ఉంటారా? అన్న పలువురి సందేహాలకు సమాధానం దొరికినట్లయింది.