ఇటలీని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైన ఈ భూకంపం తీవ్రత కారణంగా సెంట్రల్ ఇటలీ ఊగిపోయింది. ప్రకంపనల ధాటికి పలు పలు ఇళ్లు కంపించాయని, ఇళ్లలోని సామాగ్రి స్వల్పంగా దెబ్బతినట్టు స్థానిక మీడియా తెలిపింది. రోమ్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నారు.
ఈ భూకంప కేంద్రంగా ఆగ్నేయ పెరుగ్వియాకు 68 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. గత బుధవారం కూడా మధ్య ఇటలీలో రెండుసార్లు భూప్రకంపనలు చోటుచేసుకోగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా, ఆదివారంనాడు భూకంప తీవ్రత 7.1గా యుఎస్‌జీఎస్, ఇటాలియన్ మీడియా తొలుత ప్రకటించాయి.
అయితే ఆ తర్వాత యూరోపియన్ మెటిరేటియన్ సిస్మొలాజికల్ సెంటర్ (ఈఎంఎస్‌సీ) ఈ తీవ్రతను 6.6గా పేర్కొంది. కాగా, ప్రకంపనల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు కుప్పకూలినట్టు ఇటలీ సివిల్ ప్రొటక్షన్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టారు. అయితే మృతుల సంఖ్య గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు.