ఇది భూకంప శాస్త్రవేత్తలకు ఓ అవకాశాన్ని ఇచ్చిందని, తక్కువ స్థాయి ప్రకంపనలపై పరిశోధనలు చేసేందుకు వీలు కలిగిందని అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన శైలిని పూర్తిగా మార్చివేసింది.
సీస్మాలజీ.. భూకంపాలకు సంబంధించి శాస్త్రం. భూమిలో ప్రకంపనలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటారు శాస్త్రవేత్తలు. భూప్రకంపనల శబ్దం (సీస్మిక్ నాయిస్)ను గుర్తించి భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటాలను గుర్తిస్తారు.