ఆఫీసుల్లో ఫేస్ బుక్‌‌లను ఎందుకు చూస్తారంటే.. అందుకేనట.. సర్వే ఏం చెప్తోందంటే?!

గురువారం, 23 జూన్ 2016 (14:47 IST)
ప్రపంచ దేశాల్లో సోషల్ మాధ్యమాల క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాను కొన్ని కార్యాలయాలు నిషేధించగా.. మరికొన్ని ఆఫీసుల్లో ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ వెబ్ సైట్లను ఉపయోగించుకునే వీలు కల్పించారు. అయితే అమెరికాలో మాత్రం ఉద్యోగేతర లేదా సొంత అవసరాల కోసమే చాలామంది ఉద్యోగులు ఫేస్ బుక్ లాంట్ యాప్‌లను ఆఫీసుల్లో ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా సర్వేలో ఫేస్ బుక్‌లను ఉపయోగించడం పని అలసట, ఒత్తిడి నుంచి దూరమయ్యేందుకేనని తెలిసింది. తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో ఆఫీసు వేళల్లో కొందరు ఉద్యోగులు తెరిచి పోస్టులు, లైకులు చూస్తుంటారు. కానీ ఫేస్‌బుక్‌లు చూస్తున్న వేళ బాస్‌ల కంట పడితే ఇక అక్షింతలు తప్పవు. అయితే ఆఫీసు టైమ్‌లో ఫేస్ బుక్‌లను చూస్తుండటానికి గల కారణాలపై ఉద్యోగులు ఏం చెప్తున్నారంటే .. పని అలసట నుంచి దూరం కావడానికే వాటిని మధ్యమధ్యలో చూస్తున్నారట. 
 
2,003 మంది అమెరికన్లపై చేపట్టిన ఈ సర్వేలో మానసిక అలసట నుంచి బయట పడేందుకే పని మధ్యలో ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌మీడియా వెబ్‌సైట్లను చూస్తున్నట్లు 34శాతం అంగీకరించారు. ఇక 27 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం కోసం ఈ ఖాతాలను తెరుస్తున్నట్లు వెల్లడించారు. మధ్యమధ్యలో సోషల్ మీడియాను అలా లుక్కేయడం ద్వారా పని అలసట దూరమవుతుందని, దీంతో పని విషయంలో మరింత మెరుగైన ఫలితాలను రాబట్టగలమని ఉద్యోగులు అంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి