సాధారణంగా ఎవరైనా చాక్లెట్లు తింటారు, బిస్కట్లు, స్వీట్లు వంటివి ఆరగిస్తుంటారు. కానీ, ఆ అమ్మాయి ఏకంగా జుట్టే తినేసింది. అలా ఏకంగా నాలుగు కేజీలు వెంట్రుకలను తన పొట్టలో భద్రపరిచింది. వెంట్రుకలు పొట్టలో చేరేకొద్దీ భరించలేని కడుపునొప్పి రావడంతో కిర్గిజ్‌స్థాన్‌లోని వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి వెంట్రుకల ఉండను తొలగించారు.
ఆమె జీర్ణ వ్యవస్థలో పెద్ద ఉండ పేరుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. ఆమె పొట్ట బాగా వాచిపోయిందని, చివరకు లోపల నుంచి మొత్తం జుట్టు, ఊలు బయటకు తీశామని వైద్యులు వెల్లడించారు.