బెడ్రూంలో కెమేరా మర్చిపోయాడు... తన ప్రాణ స్నేహితుడితో భార్య రొమాన్స్ రికార్డ్...

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:15 IST)
తన కెమెరాకు చార్జ్ అయిపోయిందని బెడ్రూంలో కెమేరాకు చార్జ్ పెట్టాడు. ఐతే అర్జెట్ ఫోన్ కాల్ రావడంతో చార్జ్ పెట్టిన కెమేరాను మర్చిపోయి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాత్రి ఇంటికి వచ్చి చూసినప్పుడు కెమేరాకు చార్జ్ పెట్టిన సంగతి గుర్తుకు వచ్చింది. దానితో చార్జ్ పెట్టిన కెమేరాను తీసుకుని, యధాలాపంగా ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే... అందులో అతడి భార్య మరో వ్యక్తితో శృంగారం చేస్తూ కనబడింది. 
 
వివరాల్లోకి వెళితే... చైనాలో వుండే యాంగ్ తన కారులో వుండే డ్యాష్ కెమేరాను తెచ్చి ఇంట్లో బెడ్రూంలో చార్జికి పెట్టాడు. అలా చార్జ్ పెట్టిన సమయంలో అది రికార్డ్ ఆన్ అయి వుందన్న సంగతి గుర్తించలేదు. అర్జెంట్ కాల్ రావడంతో వెళ్లిపోయాడు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కెమేరా ఆన్‌లో వుండటం, అది చార్జింగులో వుండటం గుర్తించాడు. ఆ కెమేరాను తీసుకుని అందులో రికార్డైన దృశ్యాల్ని చూసి షాక్ తిన్నాడు. 
 
ఎందుకంటే.... తన స్నేహితుడు, స్థానిక మేయర్ అయిన లియు తన భార్యతో మాట్లాడుతూ, కొద్దిసేపటికి ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె దుస్తులు విప్పేసి శృంగారం చేశాడు. ఇదంతా రికార్డయింది. ఐతే అది జరిగింది 2016లో. కానీ ఈ సంగతిని బయటపెట్టలేదు. తన కుమారుడు యూనివర్శిటీ పరీక్షల వుండటంతో భార్యతో గొడవపడితే అతడి చదువు ఆగిపోతుందని భావించాడు. చివరికి 2018లో విడాకులు తీసుకోవాలని నిర్ణయించి సదరు వీడియోను స్థానిక ప్రభుత్వానికి అందజేశాడు. ఐతే దీనిపై అతడి భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కదలికలను గమనించేందుకే రహస్యంగా కెమేరా పెట్టి ఇదంతా షూట్ చేశాడని ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం వెల్లడించాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు