నాకు నగ్నంగా ఉండటమే అమితమైన ఇష్టం : ఇండియన్ టెక్కీ మీనాల్ జైన్

సోమవారం, 6 జూన్ 2016 (09:39 IST)
ఇటీవల లండన్ నగరంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఓ నగ్న ర్యాలీ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియాలో ఐటీ కంపెనీ నడుపుతున్న ఇండియన్ టెక్కీ మీనాల్ జైన్ కూడా పాల్గొన్నారు. ఈ తరహా ర్యాలీలో పాల్గొనడంలో గొప్పేంటి అనే కదా మీ సందేహం. ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఈమె అందరి భారతీయ మహిళల్లా సంప్రదాయాన్ని పాటించడం అస్సలు ఇష్టముండదు. బాగా ఫారిన్ కల్చర్‌కు అలవాటుపడిపోవడంతో.. నగ్నంగా ఉండేందుకే అమితాసక్తిని ప్రదర్శిస్తుంటారు.
 
ఈ నేపథ్యంలో లండన్‌ ర్యాలీలో పాల్గొనడంపై ఆమె స్పందిస్తూ.. రోజులో అధిక శాతం నగ్నంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతుందట. బీచుల్లో కూడా చాలాసార్లు పూర్తి నగ్నంగా తిరిగిందట. అంతేనా.. లేడీ గోడివా కలం పేరుతో ఓ బ్లాగ్ను కూడా నడుపుతూ.. అందులో నగ్నత్వం గురించి బాగా ప్రచారం చేస్తోంది. అంతేకాదు పుట్టినప్పుడు, పోయేటప్పుడు లేని ఈ దుస్తుల గొడవ నడుమ ఎందుకు అనే సిద్ధాంతాన్ని ఈమె ఫాలో అవుతుందట. ఏదేమైనా.. ఈ అమ్మడు ఆ ర్యాలీలో పాల్గొని రికార్డ్ సాధించడం పట్ల కొందరు సంతోషంగా వుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి