వివరాల్లోకి వెళితే శాన్జోస్లోని ఇండిగో ఓక్ లేన్లో నివాసముంటున్న జేమ్స్ నల్లాన్ (63) తన భార్య సోనియా (48) నల్లాన్ను గత శనివారం ఇంట్లోనే కాల్చి చంపాడు. ఆ సమయంలో నల్లాన్ కుమారులు సాహిల్(21), నితిన్ (20)లు ఇంట్లో లేకపోవడంతో పాటు స్థానికులు తుపాకీ శబ్ధం విని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అయితే నల్లాన్ సోదరుడు క్రిస్ నల్లాన్ మాత్రం జేమ్స్ నల్లాన్ మానసికంగా బాధితుడని చెప్తున్నారు. ఏడేళ్ల క్రితం ఇంటి పనుల్లో భాగం గాయపడిన జేమ్స్ మూడు నెలల పాటు కోమాలోకి వెళ్ళిపోయారని, కోమా నుంచి కోలుకున్నాక.. అతని వ్యక్తిగతంలో మార్పు వచ్చిందన్నారు. తన భర్తను సోనియా కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేదని.. కోమాలో ఉన్నప్పుడు చాలా కేర్ తీసుకుని చూసుకుందని చెప్పారు.