ఐసిస్‌లో వెయ్యి మందిని చేర్పించాలని భావించిన కర్ణాటక బ్రదర్స్ ఏమయ్యారు?

బుధవారం, 27 ఏప్రియల్ 2016 (11:58 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్). ఈ సంస్థ పట్ల ప్రపంచ వ్యాప్తంగా యువతీ యువకులు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి వారిలో భారత్‌లో కూడా ఉన్నారు. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని భట్కళ్‌కు చెందిన సుల్తాన అర్మర్‌, షఫీ అర్మర్‌ సోదరులు ఇసిస్ పట్ల ఆకర్షితులయ్యారు. దీంతో ఇసిస్‌తో కలిసి పని చేసేందుకు సిరియా వెళ్లారు.
 
వీరిలో పెద్దవాడైన సుల్తాన అర్మర్‌ 2015 మార్చిలో అమెరికా దాడులలో మృతి చెందగా షఫీ అర్మర్‌ కూడా అమెరికా డ్రోన దాడులలోనే మరణించాడు. భారత నుంచి కనీసం వెయ్యి మంది యువకులను ఐసిస్‌లో చేర్పించడమే లక్ష్యంగా షఫీ అర్మర్‌ స్లీపింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేసుకున్నాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే 30 మంది యువకులను మాత్రమే చేర్చిన షఫీ.. ఇటీవల అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ సోదరుల లక్ష్యం నెరవేరకుండానే ముగిసింది. 

వెబ్దునియా పై చదవండి