ప్రపంచంలోని 111 దేశాల యూజర్లకు సంబంధించిన డేటాతో జరిగిన అధ్యయనంలో భారతీయులు సగటున రోజుకు 4,297 అడుగులు వేస్తున్నారని తేల్చారు. వీరు సేకరించిన మొత్తం డేటా ప్రకారం మానవులు సగటున రోజుకు 4,961 అడుగులు వేస్తున్నారు.
భారతీయులు మాత్రం 4,500 అడుగులు మాత్రమే వేస్తున్నారని తేలింది. ఇక ఇండోనేషియన్లు రోజుకు 3513 అడుగులు మాత్రమే నడుస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే అధిక శాతం మంది బద్ధకస్తులున్న దేశం ఇండోనేషియన్లని పరిశోధకులు పేర్కొన్నారు.
ఇక అత్యధిక దూరం నడుస్తూ బద్ధకం లేదనిపించుకున్న దేశంలో హాంకాంగ్ అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలోని వారు సగటున 6,880 అడుగులు వేస్తున్నారని తేలింది. హాంకాంగ్ తరువాతి స్థానంలో వరుసగా చైనా, ఉక్రెయిన్, జపాన్, రష్యా దేశాలు ఉన్నాయి. జపనీయులు ఆరువేల అడుగులు వేస్తున్నారు. కానీ సౌదీ అరేబియా, ఇండోనేషియా ప్రజలు మాత్రం 3,900 స్టెప్పులు మాత్రమే వేస్తున్నారు.