గాలిలో ఎగిరే పిజ్జాలను మీరెప్పుడైనా చూశారా?

సోమవారం, 4 డిశెంబరు 2017 (12:29 IST)
వ్యోమగాములు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం పోషకాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటారు. అయితే జంక్ ఫుడ్స్ వారు తీసుకోరు. ఈ నేపథ్యంలో అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)లో నివ‌సించే వ్యోమగాములకు పిజ్జా తినిపించాలనిపించిందట. ఇప్పటికే డీహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడంతో వారి నాలుక చచ్చుపడిపోగా, కొత్త రుచుల కోసం వ్యోమగాములు వెంపర్లాడుతున్నారట. ఈ క్రమంలో అక్కడే వున్న ఓ ఇటాలియ‌న్ వ్యోమ‌గామి పావులో నెస్పోలీ ఎక్కువ‌గా పిజ్జా గురించి త‌న ట్వీట్ల‌లో ప్ర‌స్తావించారు. 
 
తనకు పిజ్జా తినాలనుందని.. మేఘాలను చూస్తే తనకు పిజ్జా గుర్తుకొస్తున్నట్లు ట్వీట్స్ చేశారు. దీన్ని చూసిన నాసా వారికి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇటీవ‌ల వెళ్లిన ఆహారం స‌ర‌ఫ‌రాలో భాగంగా వారికి పిజ్జా తయారు చేసుకునే ప‌దార్థాల‌ను పంపింది. ఇంకేంముంది.. వ్యోమగాముల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే వారు పిజ్జా తయారు చేసుకుని.. గాలిలో ఎగురుతున్న పిజ్జాలను తింటూ ఫోటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి. 

Quando hai davvero voglia di pizza... Basta menzionarlo casualmente al capo della @Space_Station durante un evento live

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు