ఇరాన్ ఎయిర్ కంపెనీకి చెందిన ఫాకర్ 100 విమానంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక కారణాలతో వెనుకవైపు ఉండే ల్యాండింగ్ గేర్ సకాలంలో తెరుచుకోకపోవడం వల్ల మంటలు చెలరేగినట్లు తెలిపారు. వెంట వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ హాని జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాల కోసం మరింత లోతైన దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు.