ఇరాక్‌లో కీలకమైన ఎయిర్‌బేస్‌ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల స్వాధీనం!

శుక్రవారం, 29 ఆగస్టు 2014 (12:24 IST)
ఇరాక్‍లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఇరాక్ అంతటా విధ్వంసం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పక్కనే ఉన్న మరో ముస్లిం దేశం సిరియాపై పట్టుబిగిస్తున్నారు. సిరియాలోని సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్న మిలిటెంట్లు సైనికులను బందీలుగా పట్టుకున్నారు. 
 
ఈ క్రమంలో కీలకమైన ఎయిర్ బేస్ ఒకటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వశమైంది. ఎయిర్ బేస్‌తో పాటు అక్కడ ఉన్న ఫిరంగులు, ఆయుధాలు ఉగ్రవాదుల స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కొన్ని ఫోటోలను ఐఎస్ఐఎస్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తివ్రవాదుల ఆగడాలను ఇరాక్, సిరియా ప్రభుత్వ బలగాలు కూడా అడ్డుకోలేక పోతున్నాయి. దీంతో వారు మరింతగా పెట్రేగిపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి