పెటర్నటీ లీవు పెట్టి.. ప్రియురాలితో షికార్లు.. జపాన్ ఎంపీ పదవికి ఎసరు!

శనివారం, 13 ఫిబ్రవరి 2016 (11:37 IST)
పెటర్నటీ లీవుతో ఉద్యోగాన్నే ఊడగొట్టుకున్నాడు ఓ జపాన్ ఎంపీ. వివరాలలోకి వెళితే పెటర్నటీ సెలవులు భార్యతో కలిసి గడిపేందుకు పురుషులకు ఇస్తుండటం తెలిసిందే. అలాంటి సెలవుల్ని ప్రియురాలి కోసం కేటాయించిన జర్మనీ ఎంపీ తన పదవికే ఎసరుపెట్టుకున్నాడు. జర్మనీలోని క్యోటో నియాజకవర్గ ఎంపీగా అయిన మియాజాకి ప్రజాప్రతినిధుల్లో తొలిసారి పెటర్నటీ లీవు తీసుకున్నారు.
 
గత ఏడాది జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటి రెండు వారాలు సదరు జపాన్ ఎంపీ పెటర్నిటీ లీవులో ఉన్నారు. అదే సమయంలోనే అంటే ఫిబ్రవరి 4న ఆతని భార్య కూడా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దానికి కొన్ని గంటల ముందు క్యోటో నగరంలో ఓ వేడుక ఘనంగా జరిగింది. అందులో భాగంగా ఎంపీ, ఆయన ప్రియురాలు, సహచర ఎంపీ మొగుమి కనెకొతో కలసి హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆమెతో అచ్చికబుచ్చికలాడుతున్న ఎంపీని ఓ స్థానిక దినపత్రిక ఫోటోలు తీసి ప్రచురించింది. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తాయి. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాను చేసింది తప్పేనని, ప్రజలను మోసం చేసిన తనను క్షమించాలని ఆయన కోరారు. తనకు ఆ మహిళా ఎంపీకి మధ్య ఎప్పటినుండో సంబంధం ఉందని ఒప్పుకున్నారు. ఇలా వచ్చిన వార్తలు తన భార్యను బాధపెట్టాయని తెలిపారు. ప్రజా వ్యతిరేకత కారణంగా రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి