ఏసుక్రీస్తు సమాధిపై చలువరాతిని తెరిచారు.. అందులో ఏముందంటే...

శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:47 IST)
చరిత్రలో తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరిచారు. ఆయన సమాధిపై మూసి ఉంచిన చలువరాయిని తొలగించారు. ఆ వివరాలను పరిశీలిస్తే... క్రీస్తును సమాధి చేసిన తర్వాత క్రీ.శ.1555 నుంచి అత్యంత పవిత్రమైన ఈ చలువరాతిని ఇంతవరకు ఏనాడు అణువంత కూడా కదపలేదు. క్రీస్తు స‌మాధి చుట్టూ నిర్మించిన చ‌ర్చిని పున‌రుద్ధ‌రించే ప‌నిలో భాగంగా స‌మాధిపై ఉన్న పాల‌రాతిని చ‌ర్చి మ‌త‌పెద్ద‌ల స‌మ‌క్షంలో ప‌రిశోధ‌కులు జాగ్ర‌త్త‌గా తొల‌గించారు. 
 
జీసెస్‌ను సమాధి చేసిన ప్రాంతంలో అప్పట్లో ఓ పెద్ద చర్చిని నిర్మించారు. దాని మధ్యలో సమాధి చుట్టూ ఓ చిన్న నిర్మాణం కూడా ఉంది. దీన్నే 'ఎడిక్యుల్' అంటారు. అయితే, అక్కడ గతంలో ఓ సారి అగ్నిప్రమాదం సంభవిస్తే 1808, 1810 మధ్య దాన్ని పునరుద్ధరించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇంత‌కాలానికి క్రీస్తు స‌మాధి ద‌గ్గ‌ర చర్చిని రెనోవేట్ చేస్తున్నారు. ఇందులోభాగంగానే, సమాధిపై ఉన్న చలువరాతిని... చర్చి మతపెద్దల సమక్షంలో అతి జాగ్రత్తగా పరిశోధకులు తొలగించారు. 
 
స‌మాధిపై ఉంచిన పాల‌రాతిని జాగ్ర‌త్త‌గా తొల‌గించామ‌ని దానికింద ఉన్న వ‌స్తువుల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయామ‌ని ఫ్రెడ్రిక్ హైబ‌ర్ట్ అనే శాస్త్ర‌వేత్త వెల్లడించారు. క్రీస్తు పార్థీవ దేహాన్ని ఏ రాయి మీద పెట్టారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సి ఉంద‌ని ఆయన అన్నారు. క్రైస్త‌వుల విశ్వాసం ప్ర‌కారం క్రీస్తును 30 లేదా 33 శ‌తాబ్దంలో క్రీస్తును స‌మాధి చేశారు. మ‌ర‌ణించిన మూడో రోజున క్రీస్తు పున‌రుత్థానం చెందాడ‌ని క్రైస్త‌వులు నమ్ముతున్నారు.

వెబ్దునియా పై చదవండి