ప్రపంచ యుద్దం కంటే ప్రమాదకరంగా భావించి కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుతం కరోనాపై యుద్ధం చేయాల్సిన అవసరం వుందని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని...ప్రజలంతా తప్పకుండా ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని సూచించారు.
జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా కిషన్ రెడ్డి తెలియజేశారు. లాక్ డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు .చైనా మన దేశానికి సరిహద్దులో ఉన్నప్పటికీ మన దేశంలోకి ఆలస్యంగా కరోనా వైరస్ ప్రవేశించిందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రతి వ్యక్తి స్వీయ నిర్భధం పాటించాల్సిన అవసంరం ఉందని కిషన్ రెడ్డి సూచించారు.