ఈ వివరాలను పరిశీలిస్తే, ఉక్రెయిన్ దేశంలో నిర్బంధ సైనిక శిక్షణ అమల్లో వుంది. దీంతో యేడాదికోసారి సైనికాధికారులో జనావాసిత ప్రాంతాలకు వచ్చి యువకులను సైన్యంలోకి ఎంపిక చేస్తుంటారు. వీరికి శిక్షణ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే, అలెగ్జాండర్ కొండ్రాత్యుక్ అనే ఓ యువకుడు సైనిక సేవల నుంచి తప్పించుకునేందుకు 81 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడాడు. ఈ వ్యవహారం కాస్త అధికారులకు తెలియడంతో అతడిపై విచారణ చేపట్టారు. అయితే వరుడు మాత్రం తన బంధువైన ఆమెపై అత్యంత ప్రేమ ఉన్న కారణంగానే వివాహం చేసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు.
మ్యారేజి సర్టిఫికెట్‌తో పాటు ఆమెకు ఇతరుల సాయం అవసరమంటూ వికలాంగ సర్టిఫికేట్ కూడా చూపిస్తాడు. అతడు ఇలా ఆధారాలుగా చూపించిన ప్రతిసారీ సైన్యంలో చేరకుండా తప్పించుకుంటున్నాడని వెల్లడించారు. ఉక్రెయిన్‌లో నిర్బంధ సైనిక శిక్షణ అమల్లో ఉండగా.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం మినహాయింపుల ఉంటుంది. అలెగ్జాండర్ ప్రస్తుతం సరిగ్గా ఇదే అవకాశాన్ని వాడుకుంటున్నట్టు తెలుస్తోంది.