వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన 35 ఏళ్ల తల్లి డబ్బు చెల్లించేవారు ఎవరైనా సరే తన కూతుర్ని అనుభవించేందుకు రావొచ్చని ఆన్లైన్లో ప్రకటనలు చేసింది. అంతటితో ఆగకుండా కూతురుపై దారుణంగా అత్యాచారం చేయించి ఫోటోలు, వీడియోలో తీయించింది. ఈ విషయం చివరకు పోలీసులకు తెలియరావడంతో.. ఆ మహిళ ఇంట పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఎన్నో అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు, ఆ బాలికపై లైంగిక దాడి జరుగుతుండగా ఆమె పక్కనే ఉండి చూస్తున్నట్లు ఉన్న వీడియోల్ని సొంతం చేసుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ జరిపారు. విచారణలో కూతురిపై లైంగిక దాడి జరపించడమే కాకుండా గతంలో 12లైంగిక నేరాలకు పాల్పడిందని తేలింది.