అలాగే, ఇటీవలి ట్రంప్ విదేశీ టూర్లలో మెలానియా వైఖరి వారిద్దరి మధ్యా విభేదాలు ఉన్నట్టు అనుమానాలను రేకెత్తించిన సంగతి తెలిసిందే. సౌదీలో, రోమ్‌లో ట్రంప్ చెయ్యి అందించినా, దాన్ని అందుకోకుండా అంటీ ముట్టనట్టు మెలానియా వ్యవహరించడంతో, అమెరికన్లు సైతం అవాక్కయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. గత కొంతకాలంగా తన భర్తకు దూరంగా ఉండటానికి గల కారణం తెలిసిపోయింది.
ప్రస్తుతం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో ఉంటున్న మెలానియా, కొడుకు చదువు పూర్తి కావడంతో వైట్‌హౌస్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. అలాగే, తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు జూన్ 14న ట్రంప్ పుట్టినరోజు నాటికి ఆమె వైట్ హౌస్‌కు వచ్చేస్తారని, తద్వారా తమ బంధంపై నెలకొన్న అనుమానాలను ఆమె తీరుస్తారని సమాచారం.