జికా వైరస్‌కు కారణం దోమలు. ఈ నేపథ్యంలో జికా సహా ఎన్నో వ్యాధులను వ్యాపింపజేస్తున్న దోమల నివారించాలని ఐటీ దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్ నడుం బిగించాయి. దోమల ద్వారా వచ్చే రోగాల నుంచి ప్రజలను రక్షించే దిశగా.. సరికొత్త హైటెక్ టూల్స్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి
వీటికి కాలిఫోర్నియా లైఫ్ సైన్సెస్ వంటి కంపెనీలు కూడా జత కలిశాయి. జికా వైరస్ కలిగున్న దోమల కోసం టెక్సాస్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతాన్ని మైక్రోసాఫ్ట్ ఎంచుకుని, అక్కడి నుంచి దోమలను సేకరిస్తోంది. ఇక దోమలు సంతానోత్పత్తిని తగ్గించే దిశగా, కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌కు అనుబంధం లైఫ్ సైనెన్సెస్ విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది.