దక్షిణ మలేషియాలో మేక కడుపున వింత జంతువు.. మనిషి తల.. మేక శరీరం...

బుధవారం, 27 ఏప్రియల్ 2016 (15:44 IST)
దక్షిణ మలేషియాలో ఓ మేక వింత జంతువుకు జన్మనిచ్చింది. తల మాత్రం మనిషి తలని పోలిన రూపంలో ఉండగా, మిగిలిన శరీరమంతా మేకను పోలినట్టుగా ఉంది. ఈ వింత జంతువు ఫెల్డా అనే గ్రామంలోని జమాలుద్దీన్ అబ్దుల్ సమద్ అనే రైతు ఇంట జన్మించింది. 
 
ఈ రైతుకు మేకల మంద ఉంది. ఈ మేకల్లో ఒకటి ఈ వింత జంతువుకు జన్మనిచ్చింది. దీనిని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి వెళ్లారు. అయితే, ఈ వింత జంతువు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోయింది. అయినప్పటికీ.. పరిశోధనల కోసం స్థానిక వెటర్నరీ సర్వీస్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ఈ కళేబరాన్ని అప్పగించారు. 

వెబ్దునియా పై చదవండి