బ్రిక్స్ : ఉగ్రవాదంతో పోరాడుతున్న ఆప్ఘన్‌కు సాయపడదాం-మోడీ పిలుపు

గురువారం, 17 జులై 2014 (16:54 IST)
బ్రిక్స్ సుమిట్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ దేశాధినేతలతో నరేంద్ర మోడీ సఫలమైంది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో పాటు బ్రిక్స్ దేశాల అధినేతలతో మోడీ సమావేశం సానుకూల ఫలితాలనిచ్చాయని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. 
 
ఇదే విధంగా బ్రిక్స్ వేదికనుంచి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్, సిరియా, ఇరాక్ ఘర్షణలవంటి ప్రపంచ సంక్షోభాలలో సమష్టి స్వరం వినిపిద్దామని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంతో పోరాడుతున్న అఫ్ఘానిస్థాన్‌కు సాయపడదామని కోరారు. 
 
కాగా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సభ్యదేశాల అధినేతలతో మోడీ చర్చలు జరిపారు. ముఖ్యంగా చైనాతో సరిహద్దు సమస్య విషయమై మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను తేల్చుకుందామని జి జిన్‌పింగ్ ముందుకు రావడం కూడా ఆశావహమైన పరిణామన్నారు.

వెబ్దునియా పై చదవండి