నైజీరియాలో ఆత్మాహుతి దాడి : 30 మంది మృత్యువాత

మంగళవారం, 25 నవంబరు 2014 (19:48 IST)
నైజీరియాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 30 మంది వరకు మృత్యువాత పడ్డారు. జనసమ్మర్ధం అధికంగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఈ దాడి జరగడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఆత్మాహుతి దాడిలో ఇద్దరు మహిళలు పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెల్సిందే. గతంలో ఇదే ఉగ్రవాద సంస్థ ఓ స్కూల్ నుంచి బాలికలను అపహరించిన సంగతి కూడా తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి