ఒకే హాస్పిటల్‌లో గర్భవతులైన 9 మంది నర్సులు...

బుధవారం, 27 మార్చి 2019 (15:25 IST)
వాళ్లందరూ ఒకే హాస్పిటల్‌లో విధులు నిర్వర్తించే నర్సులు. వాళ్లలో 9 మంది నర్సులు గర్భవతులయ్యారు. వీరందరూ పోర్టులాండ్‌లోని మైనేలోని ఓ ఆస్పత్రిలో ప్రసూతి వార్డులోనే నర్సులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 9 మందిలో ఎనిమిది మంది నర్సులు ఆస్పత్రి డ్రస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసారు. విచిత్రం ఏమిటంటే ఈ నర్సులందరూ ఒకే నెలలో డెలివరీ అయ్యే అవకాశం ఉంది. 
 
కాగా వాళ్లలో ఒకరికొకరు డెలివరీ చేసుకోవాలని నర్సులు ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీళ్లందరూ ప్రసూతి వార్డులో విధులు నిర్వర్తిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ.. తమ ఆరోగ్యాలకు ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరికి సంబంధించిన ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు