యూకేలో విస్తరిస్తున్న నోరో వైరస్.. 371 మందికి పాజిటివ్

శుక్రవారం, 27 జనవరి 2023 (21:59 IST)
చైనాలో నోరో వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. చైనా తర్వాత యూకేలో కూడా నోరో వైరస్ విస్తరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యూకేలోని ఆసుపత్రులు నిండిపోయాయి. నోరో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. 
 
దేశంలో ప్రతిరోజూ సగటున 371 మంది నోరోవైరస్‌తో ఆస్పత్రి పాలవుతున్నారని వైద్యులు గుర్తించారు. గత వారంతో పోలిస్తే ఈ వారం 8 శాతం పెరిగింది. పిల్లలు, వృద్ధులు ముఖ్యంగా నోరో వైరస్ దాడులకు గురవుతారని యూకే ఆరోగ్య అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు