బ్రిటన్ కు ఉత్తర కొరియా హెచ్చరిక

సోమవారం, 13 జులై 2020 (09:16 IST)
ఇన్నాళ్లూ అమెరికాతో తలపడిన ఉత్తర కొరియా.. ఇప్పుడు బ్రిటన్ కూ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా మాటలు విని తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

ఉత్తర కొరియా జైళ్లలో ఖైదీల హత్య, హింస, బలవంతపు శ్రమ వంటి ఆరోపణలతో ఉత్తరకొరియా ప్రజా భద్రతా మంత్రులపై బ్రిటన్‌ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనిని ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి తీవ్రంగా 
ఖండించారు.

అమెరికాను గుడ్డిగా అనుసరిస్తూ 'నీచమైన రాజకీయ పథకం'లో భాగంగా తమ మంత్రులపై విధించిన ఆంక్షలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని బ్రిటన్‌ను ఉత్తర కొరియా హెచ్చరించారు.

ఉత్తరకొరియాపై అమెరికా శత్రు విధానాన్ని అనుసరిస్తూ, నీచ రాజకీయ పథకంలో భాగంగా బ్రిటన్‌ ఈ ఆంక్షలు విధించిందని విమర్శించారు. ఈ ఆంక్షలను 'తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం'గా ఆయన పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు