ఎటువంటి వాదనలు కూడా అవసరం లేదన్నారు. ఒకవేళ ఈ ప్రపంచంలోని ప్రతి దేశాన్ని మహిళే ఏలితే.. అప్పుడు జీవన ప్రమాణాలు మరింత వృద్ధి సాధిస్తాయన్నారు. అన్ని విషయాల్లో మహిళలు ఫర్ఫెక్ట్ కాదు, కానీ పురుషుల కన్నా వారు బెటర్ అన్నది మాత్రం నిర్వివాదాంశం అన్నారు.
ప్రపంచంలో చాలా వరకు సమస్యలు వృద్ధుల వల్ల ఉత్పన్నం అయ్యాయని, దాంట్లో ఎక్కువ శాతం మగవారు అధికారంలో ఉండడం వల్ల ఆ సమస్యలు వచ్చినట్లు ఆయన తెలిపారు. సోషల్ మీడియా వల్ల ఎక్కువ దుష్ప్రచారం జరుగుతోందన్నారు.
మహిళలు రాజ్యాధికారాన్ని చేపడితే, అప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో అని తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఊహించకునేవాడినని బరాక్ ఒబామా తెలిపారు. ప్రతి దేశాన్ని ఓ రెండేళ్ల పాటు మహిళలు ఏలితే, అప్పుడు అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తుందన్నారు.