ఈ నేపథ్యంలో దలైలామాతో ఒబామా వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాలు తమవేనని చైనా వాదిస్తోన్న సమయంలో ఈ భేటీ జరగడం అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. కానీ టిబెట్‌ను చైనాలో భాగంగానే చూస్తున్నామని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఒబామాతో సమావేశం తర్వాత దలైలామా మీడియా మాట్లాడారు.
ప్రస్తుతం టిబెట్‌లోని పరిస్థితులను ఒబామాకు వివరించానని వెల్లడించారు. బౌద్ధమతం తమ సంస్కృతిలో భాగమన్న చైనా అధినేత జిన్‌పింగ్ వ్యాఖ్యల పట్ల దలైలామా స్పందించారు. కమ్యూనిస్ట్ పార్టీ అధినేత ఇలా మాట్లాడటం అభినందనీయమన్నారు. గత ఎనిమిదేళ్లలో దలైలామాతో ఒబామా వైట్‌హౌస్‌లో సమావేశం కావడం ఇది నాలుగోసారి కావడం విశేషం.