చిన్నతనం నుండే ఆమెకు పోస్టల్ ఉద్యోగంపై మక్కువ ఏర్పడింది. అంతేకాకుండా యుద్ధం జరిగే సమయంలో అతని సోదరుని నుండి వచ్చే లేఖల కోసం ఆమె ఆత్రుతగా వేచి చూసేదట. అప్పట్లో ఆమె నివాసం ఉంటున్న గ్రామంలో ఒక పోస్ట్‌మెన్ ఉండేవాడని, ప్రతి ఒక్కరూ అతడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లే వారని గుర్తు చేసుకుంది.
ఆమె పాఠశాల విద్యను సగంలో నిలిపివేసింది. కుటుంబ అవసరాల నిమిత్తం సరైన విద్యను అభ్యసించేందుకు ఆమెకు అవకాశం లేకపోయింది. వయస్సు పెరుగుతున్న కొద్ది ఆమె స్థానిక పోస్టాఫీసులో ఉద్యోగం సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఆమె ఇప్పటికీ ఉత్తరాలు అందించడానికి వారానికి 48 కి.మీ నడుస్తోంది. ఏమైనా ఈ వయస్సులో ఆమె చేస్తున్న పని అభినందనీయం.