భారత్‌ను హెచ్చరించిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్!

శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (12:28 IST)
విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ పర్యటనలో నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ భారత్‌ను హెచ్చరించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఘాటు ఇండియన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. 
 
ఇటీవల, గతంలో సరిహద్దు, వాస్తవాధీన రేఖ వద్ద భారత్ పలుమార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్‌ను కలవరానికి గురిచేస్తోంది. దానివల్ల ప్రాంతీయ స్థిరత్వం ప్రభావితమవుతోంది" అని ఓ ప్రకటన వ్యాఖ్యానించారు. 
 
సరిహద్దు వద్ద రెచ్చగొట్టే క్రమంలో ఎలాంటి కాల్పులే జరిగినా ప్రతిస్పందన ఘాటుగా ఇస్తామనడంలో సందేహంలేదన్నారు. కాగా గతంలో పాకిస్థాన్ అనేక మార్లు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి