పాకిస్థాన్ అణ్వాయుధాలను ఖైబర్ పష్తూన్‌క్వా సమీపంలోని పీర్ థాన్ పర్వతం దగ్గర దాస్తోందని మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఉపగ్రహం ద్వారా మిలిటరీ ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారం ప్రకారం పీర్ థాన్ పర్వతం దగ్గర షహీన్-3 బ్యాలిస్టిక్ మిసైల్స్‌ను రహస్యంగా మోహరించి వుండవచ్చునని తెలుస్తోంది. అణ్వాయుధాలను ప్రయోగించాల్సిన సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంది.
ఇలా పాకిస్థాన్ అణ్వాయుధాలను నిల్వ చేయడం భారత్‌కు ఆందోళనకరమేనని విశ్లేషకులు అంటున్నారు. అణ్వాయుధాలు దాచిన పీర్ థాన్ పర్వత ప్రాంతం భారతదేశంలోని అమృత్‌సర్‌కు 320 కి.మీ. దూరంలోనూ, చండీగఢ్‌కు 520 కి.మీ. దూరంలోనూ, న్యూఢిల్లీకి 720 కి.మీ. దూరంలోనూ ఉంది. అణ్వాయుధాలను ప్రయోగించేందుకు అనువైన ఈ మిసైల్స్ 2,750 కి.మీ. దూరంలోని లక్ష్యాలను సమర్థంగా ఛేదించగలవని మిలటరీ వర్గాలు తెలిపాయి. దీంతో భారత్‌కు పాకిస్థాన్‌తో గండం తప్పదని విశ్లేషకులు హెచ్చరించింది.