అసలు చర్చిలకు ఎందుకు వెళ్తారు.. ప్రజలు దేవుడిని ఎందుకు నమ్ముతారు అంటూ డ్యుటెర్టి ప్రశ్నించారు. దేవుడు లేడు అని బలంగా నమ్మే ఆయన.. ఈ వ్యాఖ్యల తర్వాత ఓ సవాలు విసిరారు. అసలు దేవుడు ఉన్నాడని ఎలా అంటారు? ఒక్కరైనా దేవుడిని చూసిన వాళ్లు ఉన్నారా? ఎవరైనా దేవుడితో మాట్లాడటం, లేదా ఆయనతో సెల్ఫీ దిగడం లేదా దేవుడిని చూడటం, మాట్లాడటం చేశారా అంటూ డ్యుటెర్టి ప్రశ్నించారు.