ఐదు రాష్ట్రాల్లో డోనాల్డ్ ట్రంప్ విజయభేరీ... హిల్లరీ క్లింటన్ నాలుగు చోట్ల....

బుధవారం, 27 ఏప్రియల్ 2016 (12:09 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్‌ మరింత ముందుకు దూసుకెళ్లారు. ఐదు రాష్ట్రాలకు మంగళవారం ప్రైమరీ ఎన్నికలు జరుగగా, ఈ ఐదు రాష్ట్రాల్లో ఆయన విజయభేరీ మోగించారు. అలాగే, డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా ఐదు రాష్ట్రాలకు గాను నాలుగింటిలో విజయకేతనం ఎగురవేశారు. ఒక్కచోట మాత్రమే హిల్లరీ ప్రత్యర్థి బెర్నీ సాండర్స్ గెలుపొందారు. 
 
అమెరికాలోని అత్యంత కీలక ప్రాంతాలైన కీలక ప్రాంతాలైన కనెక్టికట్‌, డెలావేర్‌, మేరీల్యాండ్‌, పెన్సుల్వేనియా, రహోడేలలో మంగళవారం ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బిలియనీర్‌ అయిన ట్రంప్‌ తన ప్రత్యర్థులు టెడ్‌క్రుజ్‌, జాన్‌ కాసిచ్‌లను ఓడించారు. డెమోక్రాట్లలో హిల్లరీకి క్లీన్‌స్వీప్‌ కాకుండా సాండర్స్‌ అడ్డుకున్నారు. 
 
రహోడే మినహా మిగతా నాలుగు చోట్ల హిల్లరీ గెలుపొందారు. రహోడేలో సాండర్స్‌ విజయం సాధించారు. నాలుగు చోట్ల గెలుపొందిన అనంతరం హిల్లరీ క్లింటన్‌ ఫిలడేల్ఫియా కన్వెన్షన్‌ సెంటర్‌లో మాట్లాడుతూ.. తాము ప్రగతిశీల లక్ష్యాలతో ప్రచారంలో మందుకెళ్తున్నామని.. అమెరికా ప్రజల మంచితనం, దేశం గొప్పతనంపై నమ్మకముందన్నారు. 

వెబ్దునియా పై చదవండి